Saturday, 18 November 2017

17ఏళ్ల తర్వాత: భారత అమ్మాయికి మిస్ వరల్డ్ కిరీటం



👉 ప్రపంచ సుందరిగా భారతీయ యువతి మానుషి చిల్లార్ విజయం సాధించి కిరీటం సొంతం చేసుకుంది. చైనాలోని సన్యా సిటీ ఎరీనా ప్రాంతంలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీల్లో పలు దేశాలకు చెందిన 118 మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు.
వైద్య విద్యార్థిని
👉 అదరగొట్టిన హర్యానా సుందరి
👉 హర్యానాకు చెందిన 21ఏళ్ల ఈ వైద్య విద్యార్థిని చిల్లార్ గ్రాండ్ ఫైనల్లో అందరినీ వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ పోటీలను శనివారం నిర్వహించారు.
👉 ప్రియాంక తర్వాత..
👉 17ఏళ్ల తర్వాత మళ్లీ..
2000లో బాలీవుడ్ నటి ప్రియాంకాచోప్రా మిస్వరల్డ్గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు 17ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థానాన్ని భారత్కు చెందిన చిల్లార్ దక్కించుకుంది
సుదీర్ఘ ప్రయాణం
చిన్ననాటి కల
👉 మిస్ వరల్డ్గా ఎంపికవడం అనేది తన చిన్ననాటి కల అని మానుషి ఈ సందర్భంగా పేర్కొంది.
విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణమని.. దాన్ని తానెప్పుడు మరచిపోనన్నారు. ఈ ప్రయాణంలో తానెంతో నేర్చుకున్నానని.. ఎంతో సంతోషం పొందినా.. ఫలితాన్ని మాత్రం విధికి వదిలేసినట్లు తెలిపింది.
👉 ఆండ్రియా, స్టీఫెనీ..
👉 రన్నరప్లుగా వీరే..
👉 ఈ పోటీల్లో మొదటి రన్నరప్గా మెక్సికోకి చెందిన ఆండ్రియా మేజా నిలవగా.. రెండో రన్నరప్గా ఇంగ్లాండ్కు చెందిన స్టీఫెనీ హిల్ నిలిచింది. కాగా, అందరిని వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మానుషి చిల్లార్కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్వాలే కిరీటాన్ని బహుకరించింది.

No comments:

Post a Comment

Popular Posts