Saturday, 18 November 2017

Current Affairs 15-11-2017👇👇👇 రాష్ట్రీయం 👇👇👇

1) ప్రపంచ తెలుగు మహాసభల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఏది?
జ: www.telangana.gov.in
2) తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
జ: అనూప్ సింగ్ ( IFS అధికారి)
3) దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాగా హైదరాబాద్ సంజీవయ్య పార్క్ లోని జాతీయ జెండాను గుర్తించిన సంస్థ ఏది?
జ: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
4) ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత జట్టు తరపున ఎంపికైన తెలంగాణ అమ్మాయి ఎవరు?
జ: గోనెళ్ళ నిహారిక

👇👇👇 జాతీయం 👇👇👇

5) ప్రధాని నరేంద్రమోడీ చతుర్భుజ కూటమిపై మనీలాలో వివిధ దేశాలతో చర్చలు జరిపారు. చతుర్భుజ కూటమిలో ఏయే దేశాలు ఉన్నాయి ?
జ: భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
6) న్యాయాధికారుల విభజన కేసులో విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ఎవరు?
జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్
7) బీఎస్ఈ కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
జ: సేతు రత్నం ( ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ )
8) క్యాన్సర్ కి కూడా కవరేజ్ వచ్చేలా ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన బీమా సంస్థ ఏది?
జ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
9) ఏసియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ సదస్సు ఏ నగరంలో జరగనుంది ?
జ: ముంబై
10) 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF-2017) కు ఏ దేశం భాగస్వామిగా వ్యవహరిస్తోంది?
జ: వియత్నాం
(నోట్: స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా థీమ్ తో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నవంబర్ 14 నుంచి 14 రోజుల పాటు జరుగుతోంది )
11) దేశంలో మొట్టమొదటి గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు- 2017 ఏ రాష్ట్రంలో జరుగుతోంది?
జ: ఛత్తీస్ గఢ్
(నోట్: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దంతెవాడలో ఈ సదస్సు జరిగింది. )
12) రసగుల్లా ఏ రాష్ట్రానికి చెందినది అని ప్రపంచ వాణిజ్యం సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపును ఇచ్చింది?
జ: పశ్చిమబెంగాల్
13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారు?
జ: 2014 – కమల్ హాసన్ , 2015- కె.రాఘవేందర్ రావు, 2016- రజనీకాంత్
14) భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
జ: కెన్నెత్ జస్టర్
15) ఆంధ్రప్రదేశ్ అగ్రిటెక్ సమ్మిట్ 2017 (అగ్రి హ్యాక్థాన్) పేరుతో అంతర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరుగుతోంది?
జ: విశాఖ పట్నం
16) బుక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: పశ్చిమ బెంగాల్ (అలిపుర్దౌర్ జిల్లాలో)

👇👇👇 అంతర్జాతీయం 👇👇👇

17) అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జి పదవికి పోటీ పడుతున్న భారతీయుడు ఎవరు?
జ: దల్వీర్ భండారీ
18) అమెరికాలో క్యాన్సర్ నివారణకు సూదిమందును విడుదల చేసిన భారతీయ కంపెనీ ఏది?
జ: డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ (మందు పేరు క్లోఫరాబైన్ )
19) ఓ క్రీడా సాధనంగా యోగా సాధన చేసేందుకు అనుమతించిన అరబ్ దేశం ఏది?
జ: సౌదీ అరేబియా
20) 10వ దక్షిణాసియా ఆర్థిక సదస్సు (SAES-2017) ఏ దేశంలో జరగనుంది?
జ: నేపాల్
21) ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం (నవంబర్ 14) యొక్క థీమ్ ఏంటి?
జ: Women and diabetes – our right to a healthy future

No comments:

Post a Comment

Popular Posts