Saturday, 11 November 2017

Employment Notification Issued by UPSC For Posts In CDSE - 2018



💢 💢 సీడీఎస్‌ఈ -2018 💢 💢

👉 త్రివిధ దళాలైన మిలిటరీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లలో ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) (I)-2018 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వివరాలు:త్రివిధ దళాల్లో ఉన్నత హోదా ఉద్యోగాలు. చాలెంజింగ్ కెరీర్ కావాలనుకొనే వారికి ఇదొక సువర్ణావకాశం. ఏటా రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా... -మొత్తం ఖాళీల సంఖ్య - 414. వీటిలో.. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)- 32 ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)- 100 -వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 13. ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల)- 45 -వీటిలో ఎన్‌సీసీ- సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 6.

👉 ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై)- 225 -ఇవి పురుష అభ్యర్థులకు మాత్రమే. వీటిలో ఎన్‌సీసీ- సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 50. ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై)- 12 -ఇవి నాన్ టెక్నికల్, మహిళా అభ్యర్థులకు మాత్రమే. విద్యార్హతలు -ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) అండ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.

👉ఇండియన్ నేవల్ అకాడమీ: ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత. -ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. -వయస్సు: 2019, జనవరి 1 నాటికి 20 - 24 ఏండ్ల మధ్య (1995, జనవరి 2 నుంచి 1999, జనవరి 1 మధ్య జన్మించాలి) ఉండాలి.

నోట్ 👉 : అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. -శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ఎత్తు (ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ., నేవీకి 157 సెం.మీ.), ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. -ఫిజికల్ కండీషనింగ్: రన్నింగ్ - 15 నిమిషాల్లో 2 - 4 కి.మీ.
పరుగెత్తాలి. -ఫుషప్స్-సిటప్స్- కనీసం 20, చిన్‌అప్స్- కనీసం 8, రోప్ ైక్లెంబింగ్- 3 నుంచి 4 మీటర్లు. -ఫీజు: రూ. 200/-, ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపికవిధానం 👉 : -రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. -రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. -ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్ పదోతరగతి స్థాయిలో ఉంటుంది. -నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.

👉 ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ -ఇవి రెండు దశల్లో ఉంటాయి. స్టేజ్- 1లో అర్హత సాధించిన వారికి స్టేజ్- 2లోకి అనుమతిస్తారు. -స్టేజ్- 1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.

👉 స్టేజ్- 2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి. -అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, సైకాలజిస్ట్‌లు పరీక్షిస్తారు. -పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు తదితర పట్టణాల్లో శిక్షణ వివరాలు: -వైద్యపరీక్షల అనంతరం శిక్షణకు ఎంపికచేస్తారు. -అభ్యర్థులు ఎంచుకున్న విభాగాల (పోస్టులు)ను బట్టి ఆయా అకాడమీల్లో శిక్షణ ఇస్తారు.

👉శిక్షణ సమయంలో రూ. 21,000 స్టయిఫండ్ ఇస్తారు. -ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)- డెహ్రాడూన్‌లో 18 నెలలపాటు, ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)- ఎజిమల నేవల్ ఓరియంటేషన్‌లో 44 వారాలు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ- హైదరాబాద్ (దుండిగల్) 74 వారాలు ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ- చెన్నైలో 49 వారాలు శిక్షణ ఉంటుంది.
👉 దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: డిసెంబర్ 4 -పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 4 –

👉 వెబ్‌సైట్: www.upsconline.nic.in

No comments:

Post a Comment

Popular Posts