Thursday, 25 January 2018

CURRENT AFFAIRS JANUARY-2017 PART-1 FOR ALL COMPETITIVE EXAMS1. 2017 జనవరి 1న ఏ రెండు దేశాలు తమ అణు స్థావరాల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి?
జ: భారత్ - పాకిస్థాన్

2. భారత్ - పాకిస్థాన్ ఏ సంవత్సరం నుంచి ఏటా జనవరి 1న తమ అణు స్థావరాల జాబితాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటున్నాయి?
జ: 1992

3. 2017 జనవరి 1న భారత్ - పాకిస్థాన్‌లు తమ అణు స్థావరాల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఈ రెండు దేశాలు ఇలా అణు స్థావరాల జాబితాలను మార్పిడి చేసుకోవడం ఇది వరుసగా ఎన్నోసారి?
జ: 26వ సారి

4. ఏ సంవత్సరంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ - పాకిస్థాన్ ఏటా రెండుసార్లు (జనవరి 1, జులై 1) భారత్‌లోని పాక్ జాతీయులు, పాక్‌లోని భారతీయుల (ఖైదీలు, జాలర్లు సహా) వివరాలను ఇచ్చి పుచ్చుకుంటున్నాయి?
జ: 2008

5. సిక్కులు గడ్డం పెంచుకున్నా, తలపాగా చుట్టుకున్నా సైన్యంలో నిరభ్యంతరంగా విధులు నిర్వర్తించవచ్చని 2017లో ఏ దేశం నూతన నిబంధనలు విడుదల చేసింది?
జ: అమెరికా

6. అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి విధించిన పరిమితుల్ని భారత్ ఉల్లంఘించిందని 2016 జనవరిలో ఏ దేశం ఆరోపించింది?
జ: చైనా

7. అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నామినేట్ చేశారు?
జ: డ్యాన్ కోట్స్

8. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) చీఫ్ అబుబకర్ అల్ బగ్దాదీని మట్టుబెట్టేందుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలిసి ఏ దేశానికి చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఏఎస్) 'కిల్ మిషన్‌'ను 2017 జనవరిలో ప్రారంభించింది?
జ: బ్రిటన్

9. ఇటీవల వార్తల్లోకి వచ్చిన చైనా తొలి హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి?
జ: జియాజియా

10. జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణుసామర్థ్యం కలిగిన అత్యాధునిక బాబర్ - 3ని 2017 జనవరిలో ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
జ: పాకిస్థాన్

11. బాబర్ - 3 క్షిపణి పరిధి ఎంత?
జ: 450 కి.మీ.

12. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోని ప్రధాన పదవుల్లో ఒకటైన అధ్యక్షుడి సీనియర్ సలహాదారు పదవికి జార్డ్ కుష్నెర్‌ను ఎంపిక చేశారు. ఈయన డొనాల్డ్ ట్రంప్‌కు ఏమవుతారు?
జ: అల్లుడు

13. 2017 జనవరిలో ఎలక్ట్రానిక్ నిఘా నౌక 'సీఎన్ఎస్ కియాంగ్‌షింగ్‌'ను ఏ దేశం ప్రారంభించింది?
జ: చైనా

14. అమెరికా మింట్ 225వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని డాలర్ల నాణెం పై ఒక ఆఫ్రికన్ - అమెరికన్ స్వేచ్ఛా మహిళ ప్రతిమను ముద్రించాలని నిర్ణయించారు?
జ: 100 డాలర్లు

15. ఇటీవల ఏ దేశంలో అవినీతి కుంభకోణంలో భాగంగా శాంసంగ్ అధిపతి లీకున్‌హీ వార్తల్లో నిలిచారు?
జ: దక్షిణ కొరియా

16. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) చేతిలో ఉన్న తూర్పు మోసుల్ ప్రాంతాన్ని 2017 జనవరిలో ఏ దేశ దళాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి?
జ: ఇరాక్

17. 2017 జనవరిలో ఏ దేశ పార్లమెంటులో కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది?
జ: బ్రిటన్

18. ఇటీవల వార్తల్లోకి వచ్చిన జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
జ: న్యూయార్క్

19. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
జ: స్కాట్ పురిట్

20. ఎరువుల సమర్థతను పెంచే నానో రేణువు ఎరువును ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
జ: శ్రీలంక

No comments:

Post a Comment

Popular Posts