Thursday, 25 January 2018

CURRENT AFFAIRS JANUARY-2017 PART-2 FOR ALL COMPETITIVE EXAMS



1. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2017లో ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
జ: జనవరి 20

2. డొనాల్ట్ ట్రంప్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడు?
జ: 45

3. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎంత?
జ: 4 సంవత్సరాలు

4. అమెరికా నూతన ఉపాధ్యక్షుడు ఎవరు?
జ: మైక్ పెన్స్

5. అమెరికా నూతన విదేశాంగ మంత్రి ఎవరు?
జ: రెక్స్ టిలెర్సన్

6. అమెరికా నూతన రక్షణ మంత్రి?
జ: జేమ్స్ మ్యాటిస్

7. ఐక్యరాజ్యసమితిలో అమెరికా నూతన రాయబారి ఎవరు?
జ: నిక్కీ హేలీ

8. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినవారు?
జ: రిపబ్లికన్

9. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏమిటి?
జ: ఏనుగు

10. డెమోక్రటిక్ పార్టీ గుర్తు ఏమిటి?
జ: గాడిద

11. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
జ: జార్జి వాషింగ్టన్

12. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు పనిచేయవచ్చు?
జ: రెండు సార్లు

13. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారి సరైన వరుస క్రమాన్ని తెలపండి?
జ: జార్జి హెర్బర్ట్ వాకర్ బుష్, విలియం జెఫర్సన్ క్లింటన్, జార్జి వాకర్ బుష్, బరాక్ హుస్సేన్ ఒబామా



14. 2017 జనవరిలో అమెరికా నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా ఏ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు?
జ: అందుబాటులో ఆరోగ్య సంరక్షణ

15. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఓవల్ కార్యాలయం ఏ నగరంలో ఉంది?
జ: వాషింగ్టన్

16. భారత్‌లోని ఏ రాష్ట్రంలో చేపట్టిన రెండు జల విద్యుత్తు కేంద్రాల పనుల్ని తక్షణం నిలుపుదల చేయాలని 2017 జనవరిలో భారత్‌కు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది?
జ: జమ్మూకశ్మీర్


17. 2017 జనవరిలో 2200 కి.మీ. పరిధి గల అణు సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి 'అబాబీల్‌'ను ఏ దేశం పరీక్షించింది?
జ: పాకిస్థాన్

18. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నినాదం ఏమిటి?
జ: మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్

19. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఏ నినాదంతో వెళ్లాలని 2017 జనవరిలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు?
జ: కీప్ అమెరికా గ్రేట్

20. ట్రాన్స్ - పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) నుంచి వైదొలగుతున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది?
జ: అమెరికా

No comments:

Post a Comment

Popular Posts