Thursday, 25 January 2018

CURRENT AFFAIRS JANUARY-2017 PART-3 FOR ALL COMPETITIVE EXAMS



1. ట్రాన్స్ - పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) లోని మొత్తం దేశాలు?
జ: 12

2. ట్రాన్స్ - పసిఫిక్ భాగస్వామ్యం ఒప్పందం (టీపీపీ) ఏ సంవత్సరంలో కుదిరింది?
జ: 2016

3. ట్రాన్స్ - పసిఫిక్ భాగస్వామ్యం ఒప్పందం (టీపీపీ)లోని సభ్య దేశాలను తెలపండి?
జ: అమెరికా, జపాన్, మలేషియా, వియత్నాం, సింగపూర్, బ్రూనై, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, చిలీ, పెరూ

4. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా 2017 జనవరిలో వాషింగ్టన్‌లో ఏ దేశాధినేతతో సమావేశమయ్యారు?
జ: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే


5. ముస్లింల ఆధిక్యత ఉన్న ఎన్ని దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారిపై 'తీవ్ర పరిశీలన'కు జనవరి 2017లో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు?
జ: ఏడు

6. ఏ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారిపై 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'తీవ్ర పరిశీలన'కు ఆదేశాలు జారీ చేశారు?
జ: ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్

7. అమెరికా నూతన రక్షణ మంత్రి ఎవరు?
జ: జేమ్స్ మ్యాటిస్

8. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ఏది?
జ: పెంటగాన్

9. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి (ఏసియాన్ - ASEAN)తో భారత్‌కు బంధం ఏర్పడి 2017 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి?
జ: 25

10. ఏసియాన్ (ASEAN) ప్రస్తుత ఛైర్మన్‌గా ఏ దేశాధ్యక్షుడు అయిన రోడ్రిగో రోవా డ్యుటెర్టే వ్యవహరిస్తున్నారు?
జ: ఫిలిప్పీన్స్

11. ఏసియాన్ (ASEAN)లోని సభ్య దేశాల సంఖ్య?
జ: పది

12. ఏసియాన్ (ASEAN)లో సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి.
ఎ) బ్రూనై      బి) కంబోడియా     సి) ఇండోనేషియా    డి) మాల్దీవులు
జ: డి (మాల్దీవులు)

13. స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఏసియాన్ (ASEAN)లోని పది సభ్య దేశాలతో ఏ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి?
ఎ) భారత్, చైనా           బి) జపాన్, ఆస్ట్రేలియా     సి) దక్షిణ కొరియా, న్యూజిలాండ్     డి) అన్నీ
జ: డి (అన్నీ)

14. ఏసియాన్ (ASEAN)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1967
15. ఏసియాన్ (ASEAN) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
జ: జకార్తా

No comments:

Post a Comment

Popular Posts